శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజలు సంతోషంతో వుండగలరు-మంత్రి కాకాణి

నెల్లూరు: సమాజంలో ప్రజలు సంతోషంతో జీవించాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అది సాధ్యమౌతుందని, శాంతిభద్రతల పరిరక్షణలో అశువులు బాసిన అమరవీరులను స్మరించుకోవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,నాయకులు,అధికారులు పాల్గొని పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. జిల్లా S.P Ch విజయ రావు మాట్లాడుతూ, అంతర్గత భద్రతల పరిరక్షణ నిర్వహణలో పోలీసు సిబ్బంది నిరంతరం విధులునిర్వర్తించడం జరుగుతుందన్నారు.విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగం చేసారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, నగర మేయర్ స్రవంతి, అడిషనల్ ఎస్.పి.లు శ్రీమతి చౌడేశ్వరి, శ్రీమతి హిమవతి, శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు తదిరులు పాల్గొన్నారు.