AMARAVATHIINTERNATIONAL

ఎనిమిది మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్

అమరావతి: గత సంవత్సర కాలంగా ఖతార్ జైల్లో నిర్బంధంలో ఉన్న 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బంది అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది..ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది..తమ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నమని భారత ప్రభుత్వం తెలిపింది..శిక్ష విధించబడిన 8 మంది ఖతార్ సాయుద దళాలకు శిక్షణ,,సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్ధ అయిన దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు..

వీరు ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టులు అనేకసార్లు తిరస్కరించాయి..వారి నిర్బంధాన్ని ఖతార్ అధికారులు పొడిగిస్తూనే ఉన్నారు..ఈ నేపథ్యంలో ఖతార్ “ఫస్ట్ ఇన్ స్టాన్స్“కోర్టు గురువారం వీరికి మరణశిక్ష విధించింది..ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఉన్నామని తెలిపింది.

వీరిపై గత సంవత్సరం ఆగస్టులో, ఇజ్రాయిల్ తరఫున, ఓ జలాంతర్గామి ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడినట్లుగా అభియోగాలు మోపిన ఖతార్ ప్రభుత్వం, వీరిని అరెస్టు చేసింది.. ఇటీవల ఈ కేసును రిపొర్టు చేస్తున్న జర్నలిస్టును,, అతని భాగస్వామిని దేశం వదిలి వెళ్లాలని ఖతార్ అధికారులు ఆదేశించారని సమాచారం..ప్రస్తుతం మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ లు:- నవతేజ్ సింగ్ గిల్,,బీరేంద్ర కుమార్ వర్మ,,సౌరభ్ వశిష్ట్,,కమాండర్లు:- అమిత్ నాగపాల్,,పూర్ణేందు తివారీ,, సుగుణాకర్.పాకకాల,,సంజీవ్ గుప్తా,,సెయిలర్:- రాగేష్ లు వున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *