DISTRICTS

ప్రజలందరూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచుకోవాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రజలందరూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన,,మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యమైన జీవన విధానాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు.. అంతర్జాతీయ క్యాన్సర్  దినోత్సవాన్ని పురస్కరించుకొని  శనివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్)  వద్ద  ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. సిద్దా నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్ధులు  తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ, బ్యానర్లు,  ప్లే కార్డ్సను చేతపట్టి ర్యాలీని GGH నుంచి కరెంట్ ఆఫీసు సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటూ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించడం కూడా వ్యాధి చికిత్సేనని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలను పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యపానం, ఆహారపు అలవాట్ల వలన ఏటేటా  క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగడంతో పాటు  ఎంతో మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధి వలన మరణించడం జరుగుచున్నదన్నారు..రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఇటీవల రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా 12 కోట్ల రూపాయాల విలువగల క్యాన్సర్ వైద్య పరికరాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రజలందరిలో క్యాన్సర్ వ్యాధిపట్ల చైతన్యం, అవగాహన కలిపించేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించడం జరిగిందని, ప్రజలు కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి వుండాలన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య కళాశాల అధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించడం అభినందనీయమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *