AMARAVATHITECHNOLOGY

భారత్,అమెరికాల మధ్య రక్షణ రంగంలో కుదిరిన కీలక ఒప్పందం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యాటనలో భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ స్నేహం మరింత బలోపేతం దిశగా కీలక అడుగు పడింది.. అమెరికాకు చెందిన ప్రఖ్యత ఏరోస్పేస్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్స్(GE),, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో భారత్ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది..భారతదేశం దేశీయంగా రూపొందించిన తేజస్ MARK-2 యుద్ధ విమానాల కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను HALతో కలిసి GE సంస్థ భారతదేశంలోనే సంయుక్తంగా ఉత్పత్తి చేయనుంది..ఈ మేరకు జనరల్ ఎలక్ట్రికల్ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది..ఈ ఒప్పందంతో భారత్,,అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకార మరింత బలోపేతం అవుతుందని సంస్థ పేర్కొంది.. భారత్ లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఉన్న సుదీర్ఘకాలిక భాగస్వామ్యం కారణంగానే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందని జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ లారెన్స్ కల్ప్ పేర్కొన్నారు..GE రూపొందించిన F-414 INS 6 ఇంజన్లను,,తేజస్ MARK-2 యుద్ద విమానల తయారీలో ఉపయోగించనున్నారు..ఇంజిన్ తయారీ ఒప్పంద కింద కీలక పరిజ్ఞానం భారతదేశానికి బదిలీ కానున్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *