నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్ పై నేను చేసిన ఆరోపణలపై,అందరూ నాపై మాటల దాడి చేస్తూన్న సమయంలో నన్ను విమర్శించాలన్న తపనతో అన్ని పాములు లేస్తే,కాకాణి అనే ఏలిక పాము కూడా లేచిందంటూ వైసీపీ రెబల్ రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శనివారం ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ సలహాదారుడు సజ్జల.రామకృష్ణరెడ్డి,నాపై కేసులు పెట్టించే మహత్కరం కార్యం తలపైకి ఎత్తుకుని,,ఆపరేషన్ నెల్లూరు రూరల్ పనిపైన వున్నాడంటూ ఆరోపించారు..మునిసిపాల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ తను శ్రీధర్ అన్నతోనే వుంటానని,అవసరమైతే పదవీకి రాజీనామ చేసేందుకు సిద్దంగా వున్నాను అని స్పష్టం చేశారు.