AMARAVATHIDISTRICTSHEALTH

రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సిద్దమౌతున్న వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రి

తిరుపతి: వెంకటేశ్వర అయుర్వేదిక ఆసుపత్రిలో రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సదరు ఆసుత్రిలో డాక్టర్లు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తొంది..రోగాల బారిన పడితే,,వేల,లక్షల రూపాయలు పెట్టి ఆల్లోపతి వైద్యం చేయించుకోలేని  మధ్య తరగతి,,దిగువ తరగతి పేద ప్రజలు ఆయుర్వేదం చికిత్స,, మందులపైన నమ్మకంతో తిరుపతి స్వీమ్స్ ప్రాగణంలోని వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రికి వస్తున్నారు..గతంలో ఈ ఆసుపత్రిలో సేవాలు అందించిన డాక్టర్ల అంకిత భావం వలన,,చాలా మంది ధిర్ఘకాల వ్యాధులతో భదపడుతున్న రోగులు, వ్యాధుల నుంచి ఉపశమనం పొందారు.. వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రికి మంచి పేరు రావడంతో ప్రతి రోజు 200 నుంచి 300 వరకు ప్రజలు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వైద్య సేవాల కోసం ఇక్కడి వస్తున్నారు..టీటీడీ ఆధ్వర్యం నడుస్తున్న ఈ ఆసుపత్రిలో,, రోగులకు ఉచిత వైద్య సేవాలు అందుతున్నాయి..అలాగే 15 రోజులకు మందులు,,చూర్ణం,,తైలంను ఆసుపత్రి వర్గాలు ఉచితంగా అందిస్తున్నాయి..అయితే ఇటీవల ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంత మంది పీ.జీ డాక్టర్లు,,టీటీడీ జె.ఇ.ఓను సైతం తప్పుదారి పట్టించి,,ఆసుపత్రిలో పేదలకు అందిస్తున్న వైద్య సేవాలు,,మందులను డబ్బు చెల్లించి పొందేలా ప్రణాళికలు సిద్దం చేశారు..ఇందులో బాగంగా ఆసుపత్రిలో కొన్ని రూమ్స్ ను పేయిడ్ సర్వీసులకు అంటూ రూ.1000 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తొంది..టీటీడీ సౌజన్యంతో పేదలకు అందే అయుర్వేద వైద్యంను సైతం,వ్యాపార దృష్టితో చూడడం దారుణమని,ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన బాధితులు వాపోయారు..ఉన్నతాధికారులు ఇప్పటికైన స్పందించి,తక్షణమే ఇలాంటి వ్యాపార పరమైన ధోరణలను నిలువరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డా.జి.లక్ష్మీ షా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *