శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం-మాఢవీధుల్లో విహరిస్తూన్న మాలయప్పస్వామి

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.. పెద్దజీయర్‌స్వామి,,చిన్నజీయర్‌స్వామి,టిటిడి ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు..టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి– ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు..సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు..