DISTRICTS

ఏపీ జెన్కో ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలి

నెల్లూరు: మంత్రి స్థానికులు గురించి అలోచించే వ్యక్తి కాదని,థర్మల్ స్టేషన్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇప్పటికి న్యాయం జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.ఈనెల 22వ తేదిన సూపర్ క్రిటికల్ టెక్నాలాజీతో పనిచేస్తున్న థర్మల్ స్టేషన్ ప్రవేటికరించేందుకు పిలుస్తున్న టెండర్ల రద్దు కోరుతు అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో అఖిలపక్షం సభ్యులతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఏపీ జెన్కోలో పనిచేస్తున్న 39 మంది పులివెందల కార్మికులను పర్మినెంట్ చేస్తూ జీవో నెంబర్ 163 విడుదల చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా,మొత్తం ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా  అని ప్రశ్నించారు. మొత్తం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, భూనిర్వాసితులకు 500 శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తూ 163 జీవో తరహాలో వెంటనే జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జెన్కో ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పనిలో నుంచి తొలగించిన జేఏసీ జనరల్ సెక్రెటరీ కె రవిని విధులలోకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం .మోహన్ రావు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన టెండర్లను ఆన్లైన్లో పెడతామని నోటీసు ఇచ్చి ఉన్నారని, 22వ తేదీ మంగళవారం ఏపీ జెన్కో గేటు వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టాలని  పరిరక్షణ  కమిటీ, ఏపీ జెన్కో జేఏసీనిర్ణయించిందని తెలిపారు. ఏపీ జెన్కో ప్రైవేటీకరణ కేవలం ఉద్యోగులు కార్మికులకే సంబంధించింది కాదని, విద్యుత్ వినియోగ చార్జీలు విపరీతంగా పెరుగుతాయని, ప్రజలందరూ ఈ ఉద్యమానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *