జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం-కలెక్టర్

ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి..
కర్నూలు: జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసిలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సోమవారం తెలిపారు.నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు.ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తుల ప్రక్రియ 02.01.2023 నుంచి ప్రారంభమైందన్నారు.. ద్యార్థులు తమ దరఖాస్తులను NVS వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs ద్వారా పంపాలని కలెక్టర్ సూచించారు..విద్యార్థులు 3వ, 4వ తరగతి ఉత్తీర్ణత పొంది, ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. విద్యార్థులు 01.05.2011 నుంచి 30. 04.2013 మధ్య జన్మించిన వారై ఉండాలని తెలిపారు..ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..ఏప్రిల్ నెల 29వ తేదీ ఎంపిక పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://cbseitms.rcil.gov.in/nvs ను సందర్శించవచ్చని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.