AMARAVATHINATIONAL

జమ్ముకశ్మీర్​ టు పంజాబ్​- డ్రైవర్ లేకుండా 70కి.మీ దూసుకెళ్లిన రైలు

అమరావతి: ట్రైయిన్ లోకో పైలట్స్ నిర్లలక్ష్యంగా వ్యవహారించడంతో,,పైలట్స్ లేకుండా గూడ్స్ ట్రైయిన్ దాదాపు 100 కీ.మీ వేగంగా 70 కీ.మీటర్ల దూరం ప్రయాణించిన సంఘటన ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్లితే…53 వ్యాగన్స్ తో ఉన్న గూడ్స్ ట్రైయిన్ నెంబరు (14806R) కటింగ్ చిప్స్(చిన్న చిన్న రాళ్లు) లోడ్ తో కశ్మీర్  నుంచి పంజాబ్ కు బయలుదేరింది..జమ్ములోని కథువా రైల్వేస్టేషన్ ఆగింది..ఇంజన్ లోని లోకోపైలట్,,అసిస్టెంట్ లోకోపైలట్ లు ఇద్దరు హ్యండ్ బ్రైక్ వేయకేండా మర్చిపోయి డ్యూటీ దిగిశారు..పఠాన్ కోట్ వైపు వెళ్లె ఈ రైల్వేట్రాక్ ఏటవాలుగా వుండడంతో,ట్రైయిన్ తొలుత నెమ్మదిగా ముందుకు కదలింది..క్రమేపి వేగం పుంజుకుని గంటలకు దాదాపు 100 కీ.మీటర్లకు చేరుకుంది..లోకో పైలట్స్ లేకుండా ట్రైయిన్ వేగంగా దూసుకుని వెళ్లుతున్న సంగతి గమనించిన అధికారులు ఆప్రమత్తం అయ్యారు..ఈ రూట్ దాదాపు అన్ని రైల్-రోడ్ లెవల్ క్రాసింగ్స్ క్లోజ్ చేశారు.. గూడ్స్ ట్రైయిన్ ను పఠాన్ కోట్,,కండ్రొలి,,మిర్తాల్,,బంగ్లా,ముకేరియా స్టేషన్స్ లో అపేందుకు అన్ని విధాలు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది..ముకేరియా స్టేషన్ దాటిన తరువాత రైల్వే ట్రాక్ సెక్షన్ ఎత్తుగా వుంటుంది..దింతో గూడ్స్ ట్రైయిన్ స్లో అయింది..వెంటనే అధికారులు చాక్యచక్యంగా వ్యవహరించి,ఉచ్చిబస్సీ స్టేషన్ వద్ద గూడ్స్ ను నిలిపి వేశారు..ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి ప్రాణ,,ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.. జరిగిన విషయం రైల్వే మంత్రి ఆశ్వనివైష్ణవ్ కు తెలిసింది..వెంటనే మంత్రి విచారణకు ఆదేశించారు..రైల్వే అధికారులు స్పందిస్తు,,మానవ తప్పిదాల కారణంగా ఈలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని,,ఆసలు ఈ సంఘటన ఎలా చోటుచేసుకుందొ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తునమని జమ్ముకాశ్మీర్ రైల్వేడివిజన్ ట్రాఫిక్ మేనేజర్ పాఠక్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *