AMARAVATHIHYDERABAD

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి.సంజయ్ కు బెయిల్

హైదరాబాద్: 10th class Hindi paper లీక్ అయ్యేందు కారణం అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు..ఈ కేసులో కరీంనగర్ జైలు నుంచి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బెయిల్ పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూనే మూడు డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట పెట్టారు. 

TSPSC పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు..TSPSC పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి KTR పాత్ర ఉందని, ఆతన్ని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు..TSPSC పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు..30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని,, వారి తరపున మాట్లాడితే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించారని మండి పడ్డారు..ఈ మూడు డిమాండ్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని,,ప్రతి జిల్లా,మండలల్లో ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు..త్వరలో వరంగల్‌లో నష్టపోయిన యువతతో ర్యాలీ చేస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *