AMARAVATHIPOLITICS

బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి.కిరణ్ కుమార్ రెడ్డి

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి,మాజీ ముఖ్యమంత్రి నల్లారి.కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు..కొద్ది కాలం క్రిందటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, శుక్రవారం (ఏప్రిల్ 7న) ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు..మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..

1952నుంచి తమ పార్టీ కాంగ్రెస్ లో ఉందని, అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందన్నారు.. కాంగ్రెస్ కు కేవలం అధికారం మాత్రమే కావాలని,,అందు కోసమే రాష్ట్ర విభజన సమయంలో ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు..కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు..క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో హైకమాండ్ తెలుసుకోలేదని,, చేసిన తప్పులేంటీ అని కూడా తెలుసుకోవడం లేదంటూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యనించారు..పరాయాల నుంచి కాంగ్రెస్ పాఠలు నేర్చుకోవడం లేదని విమర్శించారు..

అవిభజిత ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి  4 సార్లు MLAగా గెలిచారు..2004 -09 మధ్య కాలంలో శాసనసభలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి, 2010- 14 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు..ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు వీడ్కోలు పలికారు..2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *