నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

అమరావతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్ చేరుకున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనాకు కేంద్ర రైల్వే, టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోష్ స్వాగతం పలికారు..బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు..భారత్,, బంగ్లాదేశ్ మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ప్రధాని హసీనా,, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు..అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు..విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో ఆమె సమావేశంకానున్నారు.. నాలుగు రోజుల పర్యటనలో చివరి రోజైన గురువారం రాజస్థాన్ లోని అజ్మీర్‌కు వెళ్తారు.. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు.
Bangladesh PM Sheikh Hasina is warmly welcomed by MoS Railways and Textiles @DarshanaJardosh on her arrival in New Delhi for a State Visit.
The visit will further strengthen the multifaceted relationship between the two countries. pic.twitter.com/2VRIC7NI7V
— Arindam Bagchi (@MEAIndia) September 5, 2022