AMARAVATHINATIONALPOLITICS

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

అమరావతి: బీజెపీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.. మంగళవారం జైపూర్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది.. సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మకు సీఎం పదవి దక్కింది.. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవాలు అందిస్తున్నారు..సీఎం పదవి కోసం వసుంధరా రాజే, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బాబా బాలక్ నాథ్ , దియాకుమారి పోటీ పడ్డారు..అయితే చివరిక్షణంలో భజన్ లాల్ పేరును బీజేపీ అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చింది.. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ 115 సీట్లలో ఘనవిజయం సాధించింది..తనకే సీఎం పదవి తనకే ఇవ్వాలని వసుంధరా రాజే పట్టుబట్టారు.. హైకమాండ్ నచ్చచెప్పడంతో ఆమె సీఎం రేసు నుంచి తప్పుకున్నారు..సంగనేరు నుంచి కాంగ్రెస్ కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్ పై 48,081 ఓట్లతో భారీ విజయం సాధించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *