AMARAVATHI
BUSINESS
CRIME
DEVOTIONAL
DISTRICTS
EDUCATION JOBS
HEALTH
HYDERABAD
INTERNATIONAL
NATIONAL
POLITICS
SPORTS
TECHNOLOGY
సంక్షోభంలో కూరుకుపోయిన బోరిస్ జాన్సన్ ప్రభుత్వం

అమరావతి: బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ లు రాజీనామా చేశారు..నేడు మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేశారు..శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్ ట్విటర్ వేదికగా తన రాజీనామాను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలగడం కంటే తనకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు..ఈ ప్రకటన వెలువడిన కొంతసేపటికే రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాట్ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.. బోరిస్ ప్రభుత్వం మీద తనకు విశ్వాసం పోయిందని,,అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారా పేర్కొన్నారు..