ప్రధాని నరేంద్ర మోదీతో,బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశం

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి వేదికగా నవంబర్‌లో జరగనున్న G-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.‘‘ గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్, ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారని ప్రకటనలో పేర్కొంది. ఇండోనేషియాలో జరిగే G-20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతారు అని వెల్లడించింది. కొత్తగా బ్రిటన్ పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా గురువారం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.