పాకిస్తాన్ డ్రోన్లు కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

అమరావతి: అమృత్‌సర్‌లోని భారత భూభాగంలోకి పాకిస్థాన్ నుంచి ఒక డ్రోన్ ప్రవేశించడంను గమనించిన BSF సైనికులు కూల్చివేశారు. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్‌తో పాటు అనుమానాస్పద వస్తువును కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.డ్రోన్ పంజాబ్ రాష్ట్రంలోని చహర్‌పూర్ గ్రామ సమీపంలోని భారత భూభాగంలోకి చొరబడడాన్ని గమనించిన తరువాత భారత సైనికులు దానికూల్చి వేశారు.ఈ ఘటనతో పాక్ మరో స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు సైనిక అధికారులు తెలిపారు.పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సరిహద్దు సమీపంలో ఇద్దరు చొరబాటుదారులను గుర్తించడంతో,చొరబాటుదారులు వెనుతిరిగి పాకిస్తాన్ లోకి పారిపోయారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.సరిహద్దుల్లో అమర్చిన థర్మల్ కెమెరాలో పాకిస్థాన్ చొరబాటుదారుల కదలికలు రికార్డయ్యాయి.2021తో పోలిస్తే భారత భూభాగంలోకి పాకిస్థానీ డ్రోన్‌లు,ఈ సంవత్సరం దాదాపు 230 డ్రోన్‌లు కనిపించాయి.ఈ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆయుధాలు, డ్రగ్స్ పంపుతుందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.