వచ్చే సంవత్సంర ఆగస్టు 15 నుంచి BSNL 5G సేవలను అందిస్తుంది-అశ్విని వైష్ణవ్

అమరావతి: దేశంలోకి 5G సేవలు కొన్ని నగరల్లో శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (BSNL) తమ వినియోగదారులకు త్వరలోనే 5G సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న స్పష్టం అవుతొంది.ఈ విషయంను నిజం చేస్తు,,న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ BSNL వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నుంచి భారతదేశంలో 5G సేవలను అందించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. 2023 తొలి త్రైమాసంలో 4G సేవాలు ప్రారంభిస్తుందని, అటు తరువాత ఆగస్టు 15 నాటికి (BSNL 5G)ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు BSNL నుంచి TCS (Tata Consultancy Services) రూ.16 వేల కోట్ల రూపాయల ఒప్పందను కుదుర్చుకునే అవకాశం ఉంది.ఇదే సమయంలో తేజాస్ నెట్‌వర్క్స్ BSNL కోసం ఎక్విప్‌మెంట్ తయారుచేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. జనవరి 2023 నుంచి C-DOT,BSNL కలిసి (BSNL 5G) పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. ఎప్పుడన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023లోనే BSNL నుంచి 5G నెట్‌వర్క్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.అయితే, 5Gని BSNL విసృత్తంగా సేవాలు అందించేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.