x
Close
NATIONAL

రాజ్ పథ్ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చేందుకు కేంద్రం అడుగులు

రాజ్ పథ్ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చేందుకు కేంద్రం అడుగులు
  • PublishedSeptember 5, 2022

బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలం..

అమరావతి: బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోడీ స్పష్టం చేశారు..ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్,,సెంట్రల్ విస్టా లాన్ ల పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం..వీటి పేర్లను మార్చి ‘కర్తవ్య పథ్’ గా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం మార్గానికి ‘కర్తవ్య పథ్’గా పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..దీనిపై చర్చించేందుకు సెప్టెంబరు 7వ తేదిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సమాచారం..ఇప్పటికి దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు పరిధిలో చాలా రోడ్లకు బ్రిటీషర్ల కాలం నాటి పేర్లే ఉన్నాయి..అలాంటి వాటిని మార్చాలనే ధృఢసంకల్పంతో మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది..ఈక్రమంలోనే ప్రధానమంత్రి నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్డు పేరును “లోక్ కల్యాణ్ మార్గ్” గా మార్చారు. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.