AMARAVATHINATIONAL

అసభ్యకరమైన కంటెంట్‌ ను ప్రచురించే 18 OTTలపై నిషేధం విధించిన కేంద్రం

అమరావతిం అశ్లీలమైన,, అసభ్యకరమైన కంటెంట్‌ ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది..దేశంలో పబ్లిక్ యాక్సెస్‌ ఉన్న 19 వెబ్‌సైట్‌లు,, 10 యాప్‌లు,,ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేసింది.. ఇప్పటికే పలుమార్లు OTT ప్లాట్‌ఫామ్స్‌ కు కేంద్రం హెచ్చరించింది..అయితే సంబంధిత వెబ్ సైట్స్,,ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, కేంద్రం హెచ్చరికలను పట్టించుకోలేదు..దీంతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై నిషేధం విధిస్తూన్నట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది..కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో డ్రీమ్స్‌ ఫిల్మ్స్‌,, అన్‌కట్‌ అడ్డా,, వూవీ,,యేస్మా,, ట్రై ఫ్లిక్స్‌,,ఎక్స్‌ ప్రైమ్‌,, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ,,బేషరమ్స్‌,,హంటర్స్‌,,రాబిట్‌,, ఎక్స్‌ ట్రా మూడ్‌,,మూడ్‌ఎక్స్‌,,మోజ్‌ఫ్లిక్స్‌,, హాట్‌ షార్ట్స్‌ వీఐపీ,, ఫ్యూజీ,, ప్రైమ్‌ లాంటి ప్లే OTT లు ఉన్నాయి..Technology Act, 2000లోని నిబంధనల ప్రకారం ఇది నేరంగా పరిగణించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *