NATIONAL

ఐపీఎస్,సి.ఆర్.పీ.సీ.ఎవిడెన్స్ యాక్ట్ చట్టల్లో మార్పులు-అమిత్ షా

అమరావతి: వలస పాలనులోని చట్టలో మార్పులు తీసుకుని రావల్సి వున్నందని,, IPC (1860), CRPC(1973), Evidence Act(1872) చట్టాలకు కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు..గురువారం కింగ్స్ వే క్యాంప్‌లో జరిగిన ఢిల్లీ పోలీసుల 76వ రైజింగ్ డే వేడుకల్లో షా పాల్గొన్న సందర్బంలో షా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఫోరెన్సిక్, ఎవిడెన్స్ చట్టాల్లో చాలా మార్పులు రానున్నాయని తెలిపారు..మాదకద్రవ్యాల వ్యాపారులపై కఠినమైన శిక్షలు విధించబడతాయని వెల్లడించారు..ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్‌లు అందించిన హోం మంత్రి,,ఈ వ్యాన్‌లు కేసులను త్వరగా ఛేదించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.. ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు 6 సంవత్సరాలు కంటే ఎక్కువ శిక్ష విధించే కేసులలో చాలా ముఖ్యమైనవన్నారు..గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామని,,ఈశాన్య భారతంలో ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని తెలిపారు..కరోనా సమయంలో ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని హోం మంత్రి అభినందించారు..G20 సదస్సులకు పలు దేశాల అధ్యక్షులు హాజరవుతున్నందున ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *