AMARAVATHIPOLITICS

ఎన్నికలకు 100 రోజుల సమయమే ఉంది,మనం ప్రజల్లోకి వెళ్లాలి-పవన్ కళ్యాణ్

అమరావతి: అధికారమే పరామవధిగా నేను రాజకీయాల్లో రాలేదు,,నా వంతుగా ప్రజలకు సేవా చేయాలనే లక్ష్యంతో ముందుకు అడుగు వేస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు..శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు..కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి,,భవిష్యత్ కార్యక్రమాలపై కేడర్ కు దిశానిర్దేశం చేశారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వంటి పార్టీలకు జనసేన తీసుకునే నిర్ణయాలు ఇబ్బందిగా అనిపిస్తాయి.. బీజేపీ, టీడీపీతో ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు..నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను..జనసేనకు యువతే పెద్ద బలం..నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు.. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను.. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది.. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.. జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు.. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత వస్తున్నారు..నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తాను..ఏపీ భవిష్యత్తును ఒక నిర్ధిష్టమైన విధానంలో అభివృద్ధి పథంలో నడిపించాలి.. ఏపీలో ఎన్నికల కోసం వంద రోజుల సమయమే ఉంది.. మనం ప్రజల్లోకి వెళ్లాలి..జనసేన పార్టీ స్థాపించినప్పుడు గుండె ధైర్యం తప్ప నాతో ఎవరూ లేరు.. జనసేనకు బలం మన యువతరం..రెండు కోట్ల లోపు బడ్జెట్ తో నేను పార్టీ పెట్టాను.. జనసేన ప్రారంభించినప్పుడు 13 వేల మందిగా ఉన్న యువత నేడు 6 లక్షలకు చేరారు.. ప్రజలు నాకు ఇస్తున్న గౌరవంతో నాకు మరింత బాధ్యత పెరుగుతుంది..సమస్యలు పట్ల స్పందించడమే నా విధానం.. సుగాలి ప్రీతి విషయంలో చాలా ఆవేదన చెందాను.. జనసేన వ్యక్తుల పార్టీ కాదు. రాబోయే రోజుల్లో నా భావజాలం ఆలోచన కలిగిన వారు ఈ స్ధానంలో ఎవరైనా కూర్చోవచ్చు.. నా సినిమాలు ఆపేసినా, 10 రూపాయల టిక్కెట్లు అమ్మిచ్చినా, మనం ఉంటున్న హోటళ్లకు వచ్చి బెదిరించినా.. నేను ఏనాడు జాతీయ పార్టీని అడగలేదు..మన పోరాటం మనమే చేశాం.. జాతీయ నాయకులు కూడా పోరాటాలు చేసి వచ్చిన వారే.. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ-జనసేన అవగాహనతో పోటీ చేశాయని గుర్తు చేశారు..హైదరాబాద్ లో అత్యల్ప ఓటింగ్ బాధాకరం.. తెలంగాణ ఎన్నికల ఓటింగ్ శాతం చూసి బాధ కలిగించింది.. బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షులు కూకట్ పల్లిలో జనసేన కండువా కప్పుకుని ప్రచారం చేయడం ఆనందం కలిగించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *