AMARAVATHIPOLITICS

రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా-కన్నా.లక్ష్మీనారాయణ

రాజకీయ దరుద్దేశంతోనే విమర్శలు-జీవీఎల్‌ నరసింహారావు

అమరావత: కొద్ది సేపటి క్రిందట బీజేపీకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా.లక్ష్మీనారాయణ రాజీమానా లేఖను బీజేపీ అధ్యక్షడు జె.పీ నడ్డాకు పంపించారు..బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలను కన్నా మీడియాకు వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు..2014లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానన్నారు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు..2019లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించానని,,ఇప్పటికి ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందని చెప్పారు..రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు..సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు..పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు..త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

రాజకీయ దరుద్దేశంతోనే విమర్శలు:- కన్నా లక్ష్మీనారాయణ,,సోము వీర్రాజుపై కన్నా చేసిన ఆరోపణల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది..కన్నా రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలతో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడారు..సోము వీర్రాజు వల్లే తాను రాజీనామా చేశానని కన్నా అంటే, రాజకీయ దరుద్దేశంతోనే ఆయన విమర్శలు చేశారంటూ జీవీఎల్‌ కౌంటర్‌ ఇచ్చారు.. తనపై కన్నా చేసిన విమర్శలకు స్పందించనన్నారు..పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, అధిష్టానం సూచనతోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకుంటున్నారని,,సోముపై కన్నా చేసిన ఆరోపణలు సముచితం కాదంటూ జీవీఎల్‌ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *