AMARAVATHINATIONAL

భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు-ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది-సీతారామన్

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA-II ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్.. కేంద్ర బడ్జెట్లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు.. బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66 లక్షల కోట్లు వుండగా,,పన్నులు,ఇతర మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షల కోట్లుగా అంచనా వేశారు..ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్ ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు.. గత 10 సంవత్సరాలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు..ప్రధాన మంత్రి చేపట్టేక,, అయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో, ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు..
కోటి ఇళ్లకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ:- రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా రూ.15,000 – రూ.18,000 వరకు ఆదా అవుతుందని, మిగులు ఆదాయాన్ని డిస్కమ్ లకు విక్రయించొచ్చని ఆమె ప్రకటించారు.

నిర్మలా సీతారామన్ రికార్డ్: గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడడంతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా వున్న మాజీ ప్రధాని మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలిచారు.

బడ్జెట్లో కేటాయింపులు:-
మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్ కు రూ.8500కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ కు రూ.600కోట్లు కేటాయించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *