అమరావతి: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని వయసును దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించడంతో,,శుక్రవారం చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు..భద్రతా కారణాల దృష్ట్యా సాయంత్రంలోపు శోభరాజ్ ను ఫ్రాన్స్‌కు పంపడానికి ప్రయత్నిస్తున్నామని అతని భార్య నిహిత బిశ్వాస్ తెలిపారు..గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత శోభరాజ్ కు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయిని,,అతనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చని అభిప్రాయపడ్డారు..ప్రస్తుతం చార్లెస్ శోభరాజ్ కు ఆరోగ్యం, కుటుంబమే ప్రాధాన్యత అని చెప్పారు..నకిలీ పాస్ పోర్టుతో 1975లో నేపాల్ కు చేరుకున్న ఇతను ఖాట్మండులో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను చంపాడన్న అభియోగాలు నమోదయ్యాయి. అభియోగలు రుజువు కావడంతో 2003లో కోర్టు జీవితఖైదు విధించింది..శోభ రాజ్ తండ్రి భారతీయుడు కాగా తల్లి వియత్నాం దేశానికి చెందిన వారు..ఈ ఇద్దరు విడిపోయాక,, చార్లెస్ ను వెంటబెట్టుకుని అతడి తల్లి ఫ్రాన్స్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.
Nepal | We're trying to send him back to his family in France by evening for security reasons. After heart surgery, he had some issues. He might need another surgery. Health & family are priorities for him now: Nihita Biswas, Charles Sobhraj's wife, on his release from jail pic.twitter.com/KGtblEjl9s
— ANI (@ANI) December 23, 2022