రూ.95 కోట్లతో పెన్నానదికి కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణం-మంత్రి అంబటి

నెల్లూరు: పెన్నా నదికి భవిష్యత్తులో ఎలాంటి వరద ముప్పు వాటిల్లినా నెల్లూరు నగర శివారు ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ప్రజల ఇళ్లల్లోకి ఒక్క బొట్టు కూడా వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు 95 కోట్ల రూపాయలతో పెన్నానదికి కాంక్రీట్ రక్షణ గోడను పటిష్టంగా నిర్మించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు చెప్పారు..బుధవారం నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది రక్షణ గోడ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్,కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు..ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీ అంబటి రాంబాబు మాట్లాడుతూ 2021 నవంబర్లో ఊహించని వరద ప్రవాహంతో భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాలు నీట మునిగాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణానికి సీ.ఎం నిధులు మంజూరు చేశారని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి మరో ఏడాదిలోగా కాంక్రీట్ రక్షణ గోడను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.