జ్ఞానవాపి మసీదులో శివలింగానికి కార్బన్ డేటింగ్ కు నిరాకరించిన కోర్టు

అమరావతి: జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది.శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించడానికి నిరాకరించింది.శుక్రవారం ఈ కేసుపై విచారణ కొనసాగించిన కోర్టు, కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయన్న హిందూ సంఘాల వాదనతో విభేదించింది. కార్బన్ డేటింగ్ అంశంపై జ్ఞాన వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫున న్యాయవాది ముంతాజ్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ,,శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసే క్రమంలో ఒకవేళ దానికి ఏదైనా స్వల్ప భౌతిక నష్టం వాటిల్లినా అది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది ప్రస్తావించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఎ.కె.విశ్వేష,,హిందూ సంఘాల పిటిషన్ ను తిరస్కరించారు.‘‘శివలింగం ఎంతకాలం కిందటిది ? అది ఏ రకానికి చెందినది ? అనే అంశాలను గుర్తించాలంటూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సమంజసంగా ఉండదు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.