జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకు సస్పెన్షన్ విధించిన హైకోర్టు

అమరావతి: జీవో నెంబర్ 1పై రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,,G.O NO 1పై జనవరి 23 వరకు సస్పెన్షన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేసింది..ఈ కేసు విచారణపై సస్పన్షన్ విధించటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైంది..రాష్ట్రంలో రోడ్లపై సభలు,,ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం G.O NO 1ను తీసుకొచ్చింది..జీవో నెంబర్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పిస్తూ,,ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు..సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా,,దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తూ,,ఈ ఆరోపణలు రాజకీయపరంగా చేసే వాదనలేనని అని వాదించారు.. విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టును కోరారు..ధర్మాసనం జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకు సస్పెన్షన్ విధించింది..కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎటువంటి వివరాలు కోర్టులు అందజేస్తుందో మరి ?.