AMARAVATHIINTERNATIONAL

వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ను 2028లో భారత్ లో నిర్వహించాలి-ప్రధాని మోదీ

అమరావతి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభంమైన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. శుక్రవారం ప్రారంభమైన ఈ క్లైమేట్ సమ్మిట్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ క్లైమేట్ చేంజ్ ప్రక్రియ కోసం ఐక్యరాజస్య సమితి ఫ్రేమ్ వర్క్ కు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు..ఈ వేదిక నుంచి 2028లో భారతదేశంలో COP33 సమ్మిట్ ను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు మోదీ తెలిపారు..దుబాయ్ లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను చర్చించే సమ్మిట్ సెరిమోనియల్ ఓపెనింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అవకాశం కల్పించారు.. వాతావరణ అనుకూల, క్రియాశీల, సానుకూల చొరవను నేడు ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నట్లు చెప్పారు.. గ్రీన్ పవర్ చొరవ కోసం అందరం కృషిచేయాలని,, వాతావరణ మార్పులకు నాంది పలకలాంటూ ప్రధాని మోదీ ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు.. 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడమే భారతదేశ లక్ష్యమని, అలాగే శిలాజాయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు..2070 నాటికి ఉద్గారాల తీవ్రత లక్ష్యం సున్నాకు తీసువెళ్లే దిశగా ముందుకు వెళ్తామని మోదీ వివరించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *