AMARAVATHIINTERNATIONAL

పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది-ప్రపంచ వాతావరణ సంస్థ

అమరావతి: సుముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో 7 సంవత్సరాల తరువాత ‘ఎల్ నినో’ చోటు చేసుకున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ రెండు రోజుల క్రిందట ప్రకటించింది.. దీని ప్రభావంతో లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఆసియా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని,,దిని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు..జూన్ రెండవ వారంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత +0.9 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిందని తెలిపింది..
ఎల్ నినోతో కరువు పరిస్థితులు:- గత మూడు సంవత్సరాలుగా పసిఫిక్ సముద్రంపై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి..లానినో గత సంవత్సరం సెప్టెంబర్ తో పూర్తయిపోయింది..ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి..దీంతో భారత్లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణంకంటే తక్కువ వర్షపాతాన్నిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచన వేస్తున్నారు..ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం తెలిపింది..దీని కారణంగా భారత్ సహా చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది..

ఎల్ నినో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు..ప్రతి ఎల్ నినో విభిన్నమైందే.. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్ నినోతో మహాసముద్రాలు వేడెక్కడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు మందగించే ఆవకాశం వుంటుంది..ఫలితంగా వర్షాలు కురవడం తగ్గుతాయి.. 2001-20 మధ్యకాలంలో ఎల్ నినో సంభించినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడి, పంటలకు నష్టం కలిగింది..దింతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది..
ఎల్ నినో ఎప్పుడు ఏర్పడుతుంది:- పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి..ప్రపంచ దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *