నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తా-నూతన కమిషనర్ హరిత

నెల్లూరు: జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సారధ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తానని కార్పొరేషన్ నూతన కమిషనర్ డి.హరిత పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ గా గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో నగర వ్యాప్తంగా ఉత్తమమైన అభివృద్ధిని సాధిస్తామని తెలిపారు..నగర పాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు..వేగవంతమైన పాలన అందించేందుకు, త్వరితగతిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గతంలో నెల్లూరులో పనిచేసిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిని మేయర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలుసుకుని పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.