AMARAVATHIDEVOTIONAL

ప్రాణప్రతిష్ట తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు-శిల్పి అరుణ్

చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యాను..
అమరావతి: రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తరువాత బాలరాముడు పూర్తిగా మారిపోయాడు.. బాలరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకు ఒక రకంగానూ,, ప్రాణప్రతిష్ఠ తరువాత మరో రకంగానూ కనిపించాడని శిల్పి అరుణ్ యోగిరాజ్, అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు..ఈ మార్పు చూసిన తరువాత నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.. ఇది నా పని కాదని నేను భావించాను.. ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ…ఇది నిజంగా అద్భుతం అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు.. ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ చరిత్మకమైన అవిష్కరణకు ఎంపికయ్యానని,, తన భావాలను మాటల్లో వర్ణించలేనని అన్నారు.. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు 7 నెలల సమయం పట్టిందని,, 7 ఏడు నెలల కాలం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని తెలిపారు..
కొతులు:- ఒక ఆసక్తికరమైన కథని కూడా అరుణ్ యోగిరాజ్ మీడియాతో పంచుకున్నారు. తాను రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని,, అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదన్నారు.. ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని,, అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు.. అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు.. తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు.. చివరికి తాము తలుపులు తీస్తే… అవి విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేవన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *