AMARAVATHINATIONAL

మణిపూర్ అంశంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాం-కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అమరావతి: మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు..చర్చ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు..3వ రోజు పార్లమెంటు సభాకార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షలు సభను అడ్డుకోవడంతో సోమవారంనాడు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా సభ వాయిదా పడింది..
మణిపూర్ అంశంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను..విపక్షాలు చర్చకు ఎందుకు సుముఖంగా లేరో అర్ధం కావడం లేదు..ముందు సభలో చర్చను జరగనీయండి..అత్యంత సున్నితమైన ఈ అంశంలో వాస్తవం ఏమిటనేది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు..
సోమవారం పార్లమెంట్ ఆవరణలో అధికార,, విపక్ష పార్టీలు ప్లకార్డులతో పోటాపోటీగా నిరసనలకు దిగాయి.. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేస్తూ, బెంగాల్ హింస, రాజస్థాన్ లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు..ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు..ప్రధాని సభకు వచ్చి మణిపూర్ అంశంపై మాట్లాడాల్సిందే అంటూ ప్రతిపక్షలు పట్టుపట్టాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *