AMARAVATHINATIONAL

ఎన్ని రకల సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టపడుతాను-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో శనివారం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది..చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఐదేళ్ల ప్రభుత్వం దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనతో కూడినదని అన్నారు..17వ లోక్ సభను యావత్ దేశం ఆశీర్వదించనుందని,, అలాగే కొందరు సవాళ్లను చూసి భయపడి పారిపోతారని,,తనకు ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టమన్నారు.. రామమందిరం తీర్మానంపై సమాధానం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నానని ఎంపీల జైశ్రీరాం నినాదాల మధ్య మోదీ స్పష్టం చేశారు.. 17వ లోక్ సభ కొత్త బెంచ్ మార్క్ లను సృష్టించిందని,ఇదే సమయంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయన్నారు.. ఈ హయాంలో అనేక సంస్కరణలు చోటుచేసుకోవడంతో, గేమ్ ఛేంజర్ 21వ శతాబ్దపు బలమైన పునాది ఆ విషయాలన్నింటిలో కనిపిస్తుందని తెలిపారు.. రాజ్యాంగం కోసం ఎన్నో తరాలు కలలు కంటున్నాయని, అయితే ప్రతి క్షణం అడ్డంకులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.. అయితే ఈ సభ ఆర్టికల్ 370ని తొలగించి రాజ్యాంగానికి పూర్తి స్వరూపాన్ని వెల్లడించిందని, రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల ఆత్మలు మనల్ని ఆశీర్వదించాలని అన్నారు.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏకంగా పార్లమెంటు సమావేశాలు సైతం నిర్వహించిన ఘనత స్పీకర్ కు దక్కుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *