AMARAVATHIPOLITICS

ఏపిలో తిరగాలి అంటే పాస్ పోర్టు తీసుకుని రావాలా ? -పవన్

అమరావతి: ఆంద్రప్రదేశ్ లో తిరగాలి అంటే పాస్ పోర్టు తీసుకుని రావల్సి పరిస్థితులు కన్పిస్తున్నయని,,కేసులకు భయపడే వాడిని అయితే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..వారాహి యాత్రలో రాళ్లు వేసేందుకు కొంత మంది సిద్దమైనట్లు తనకు స్పష్టమైన సమాచారం వుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు అందాయి..ఈ విషయంపై కృష్ణా జిల్లా పెడనలో పెడనలో జరిగిన వారాహి యాత్రలో పవన్ పై విధంగా స్పందించారు..
పోలీసులు ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు తాను సిద్దంగా వున్నానని,,తాను నోరు తెరిస్తే కేసులు,, నోటీసులు వచ్చేస్తున్నాయని అన్నారు..పాదయాత్రలో యువతకు ఉద్యోగలు ఇస్తానని జగన్ హామీలు ఇచ్చారని,,అయితే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే యువత జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటుందని ప్రశ్నించారు..తమ సమావేశాలకు యువత భారీగా ఎందుకు వస్తున్నారని నిలదీశారు..పాలించేవ్యక్తి మనకు అండగా లేనప్పుడు అలాంటి వారిని ప్రక్క తొలగించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని జనసేనాని కోరారు.. రాజకీయాల్లో జగన్ అనే వ్యక్తి అనర్హుడని,, 2024 ఎన్నికల్లో ఆయనను రాజకీయాల్లో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు..ఇక్కడ ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు నుంచి వెళ్లాలంటే,, జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయంట,,,,అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పిందామన్నారు.. ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.ప్రజలు పదేళ్లు తన వెంట ఉంటే హైదరాబాద్ స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తానని తెలిపారు..టీడీపీతో పాటు ఇంకెవరు ముందుకు వచ్చినా కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు..తనకు బీజేపీ అశీస్సులు ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *