AMARAVATHIEDUCATION JOBS

IIT గ్రాడ్యుయేట్లు మన దేశంతో పాటు విదేశాలలో స్టార్టప్‌లకు నాంది పలుకుతున్నారు-కేంద్ర మంత్రి

తిరుపతి తన 4వ,5వ ఉమ్మడి కాన్వొకేషన్..

తిరుపతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన 4వ మరియు 5వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలను 22 ఫిబ్రవరి 2024న ఏర్పేడులోని శాశ్వత క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న రెండు బ్యాచ్‌ల విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు..ఐఐటీ గ్రాడ్యుయేట్లు మన దేశంతో పాటు విదేశాలలో అనేక స్టార్టప్‌లకు నాంది పలుకుతున్నాయన్నారు.. మొత్తం 355 బి. టెక్ డిగ్రీలు, 106 ఎం. టెక్ డిగ్రీలు, 02 డ్యూయల్ డిగ్రీలు (బి. టెక్ + ఎం. టెక్), 74 ఎం.ఎస్సీ.  డిగ్రీలు, 17 M. S. (పరిశోధన ద్వారా) డిగ్రీలు మరియు ఇన్స్టిట్యూట్ నుండి 21 PhD డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి..

మిస్టర్ సౌమిత్రో B.Tech  ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ అకడమిక్ పనితీరు 2022 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో అత్యుత్తమ విద్యా పనితీరుకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నారు. ప్రభాత్ రెడ్డి లంకిరెడ్డి 2022 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో ఆల్ రౌండ్ ప్రదర్శనకు గవర్నర్ బహుమతిని అందుకున్నారు.అలాగే మిస్టర్ నోబుల్ సాజి మాథ్యూస్ 2023 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో పాఠ్యాంశాలు,పాఠ్యేతర కార్యకలాపాలలో ఆల్ రౌండ్ ప్రదర్శనకు గవర్నర్ బహుమతిని పొందారు. 2023 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో అత్యుత్తమ విద్యా పనితీరు కోసం శ్రీమతి దేబేషీ దాస్‌కు రాష్ట్రపతి గోల్డ్ మెడల్ లభించింది.. యూజీ, పీజీ ప్రోగ్రామ్స్‌లో టాపర్లకు కూడా బహుమతులు అందజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *