AMARAVATHIDEVOTIONAL

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల: ఈ నెల 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని హోమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తామని,, హోమంలో పాల్గొనే భక్తులు రూ.1000 చెల్లించి టిక్కెట్టు పొందవలసి ఉంటుందని టీటీడీ చైర్మన్ తెలిపారు.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశం అయ్యింది..ఈ సందర్భంగా పాలకమండలిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి అయన వెల్లడిస్తూ అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసేందుకు పాలకమండలి అంగీకారం తెలిపిందన్నారు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామన్నారు.. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ.25.67 కోట్లు కేటాయిస్తున్నామని,,ఈ నగదును తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసుకుంటామని చెప్పారు.. టీటీడీలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని భూమన వెల్లడించారు..

పాలకమండలి నిర్ణయాలు:- తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయింపు..టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు,, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6850 చెల్లిస్తారు.. ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణం..మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు,,ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు,, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు రూ.21 కోట్లు కేటాయింపు.. ఆయుర్వేద హాస్పిటల్ లో రూ.1.65 కోట్లతో నూతన భవనం,,రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు,,స్విమ్స్ లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణాలు.. స్విమ్స్ లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్ ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయింపు..స్విమ్స్లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణం..డకదారిలో భక్తుల భధ్రత కోసం రూ.3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమరాలు కోనుగోలు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *