ఫిబ్రవరిలో జిల్లాకు ముఖ్యమంత్రి-తప్పనిసరిగా మాస్కులు-కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా..
నెల్లూరు: ఫిబ్రవరి నెలలో జగనన్న లేఅవుట్ గృహాలను ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారని, ఆలోగా జిల్లాలో గృహ నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్,జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కిందజిల్లాలో రెండు వైయస్సార్ జగనన్న మెగా లే అవుట్ల లో గృహ నిర్మాణం జరుగుతోందని వాటిని ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తారన్నారు. ఆలోగా గృహ నిర్మాణ సంస్థ అధికారులతో పాటు మండల ప్రత్యేక అధికారులు రోజువారీ పురోగతిపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతము గృహ నిర్మాణాల బిల్లులు చెల్లింపు సమస్యలేదని, వర్షాల భయం లేన్నందున గృహాల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.
AP FRS యాప్:-నేటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారానే దస్త్రాలు ప్రత్యుత్తరాలు జరపాలని,, అలాగే సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన AP FRS యాప్ ద్వారా ముఖ హాజరు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వేయాలన్నారు. దీనిని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులందరూ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు.
తప్పనిసరిగా మాస్కులు:- కోవిడ్ కొత్త వేరియంట్ BF-7 విస్తరిస్తున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఆసుపత్రులలో తప్పనిసరిగా మాస్కులు ధరించితేనే లోపలికి అనుమతించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ నియంత్రణకు, చికిత్స కోసం వసతులు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.కోవిడ్ మూడవ డోసు ఇంకా చాలామందికి వేయాల్సి ఉందని మొదటి రెండవ డోసులు మాదిరిగానే మూడవ డోసు కూడా పూర్తి చేయాలన్నారు
ఇసుక అక్రమ రవాణా:- అక్రమ మైనింగ్ నియంత్రణ కమిటీ సరిగా పర్యవేక్షించడం లేదని, ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకుని,వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని, ఇందుకు సంబంధించిన నివేదికను వారంలోగా అందజేయాలని స్పష్టం చేశారు.