AMARAVATHIEDUCATION JOBS

నూతన విద్యా విధానంతో అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుతుంది-సంజయ్ కుమార్

నెల్లూరు: జాతీయ విద్యా విధానం-2020 భారతీయ సమాజానికి డీఎన్ఏ లాంటిదని భారత ప్రభుత్వ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు..ఆదివారం నగరంలోని కస్తూర్భ కళాక్షేత్రంలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రంపై రెండు రోజుల జాతీయస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల భాషలు, విభిన్న సంస్కృతల కలబోత అయినటువంటి భారతదేశ సమగ్రత, ఔన్నత్యం ఎంతో గొప్పదన్నారు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో రాబోయే 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరించడానికి చోదకశక్తి గా పనిచేస్తుందన్నారు.. దేశంలో ఒకటో తరగతిలో చేరే ప్రతి వంద మంది పిల్లలకు కేవలం 75 మంది మాత్రమే 10 వ తరగతికి  చేరుతున్నారని, 56 మంది మాత్రమే 12 వ తరగతికి చేరుతున్నారన్నారు. ఇటువంటి డ్రాప్ అవుట్ ను అధిగమించి 2030 నాటికి 100% లక్ష్యం సాధించే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో రైటింగ్ స్కిల్స్ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (NCERT) డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని మాట్లాడుతూ ప్రాంతీయ విద్యా సంస్థ కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన తరుణంలో చారిత్రక విద్యా సదస్సుకు నెల్లూరు వేదిక అవడం సంతోషకరమన్నారు.. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా, విశ్వవ్యాప్తంగా రాణించేందుకు పాఠశాల దశలోనే సామర్ధ్య నిర్మాణo రూపొందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *