AMARAVATHIHEALTH

వైద్యం ప్రజల హక్కుగా ఉండేలా చర్యలు చేపట్టాలి-ప్రజారోగ్య వేదిక

నెల్లూరు: ఆరోగ్యశ్రీ పరిధిని కుటుంబానికి 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచబోతుండడం అభినందనీయమని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎం.వి.రమణయ్య,కామేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో బిల్లులు రావడంలేదని ఆరోగ్య సేవలను నిరాకరించడం, కొంత మోతాదులో రోగుల నుంచి బిల్లులు కట్టించుకోవడం జరుగుతూ ఉందన్నారు.. దాదాపుగా 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఈ బిల్లులు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగి కొనసాగిస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే..కొన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను విరమించుకున్నని తెలిపారు.. ఆరోగ్య సేవలను మెరుగు పర్చేందుకు  1. వైద్యం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా రాజస్థాన్ రాష్ట్రంలో తెచ్చినట్లుగా ఆరోగ్య  హక్కుచట్టాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలి..2. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలి..3. ఇటీవల ఉద్దానంలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని,మూత్రపిండ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేసిన విధంగా 11 ప్రభుత్వ ఆసుపత్రులలో నెఫ్రాలజీ,న్యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు..4. ఆరోగ్యశ్రీ కేటాయింపుల వలన వైద్య ఆరోగ్య బడ్జెట్ కు హాని జరగకుండా ఆరోగ్యశ్రీ కేటాయింపులను వైద్య ఆరోగ్య బడ్జెట్ నుంచి వేరుచేసి ప్రత్యేకమైన ఆరోగ్యశ్రీ బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *