AMARAVATHIBUSINESS

అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపార కేంద్రంగా బోర్స్ సముదాయం-ప్రధాని మోదీ

అమరావతి: అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి సూరత్ లోని డైమండ్ బోర్స్ కార్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోందని,,ఈ భవనంలో 175 దేశాల నుంచి 4 వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనుండడం అభినందనీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారం బోర్స్ కేంద్రంను ప్రారంభించిన సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఎగుమతులు-దిగుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటైల్ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్ లాంటి అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయన్నారు.. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్స్ కేంద్రం ద్వారా 1.50 లక్షల మందికి ఉపాధి లభించబోతోందని,, డైమండ్ బోర్స్ సెంటర్ తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు..గత 80 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్ ను,, సూరత్ డైమండ్ బోర్స్ అధిగమించిందన్నారు..
సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయం అత్యంత ఆధునిక నిర్మాణ శైలీతో 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు..ఒకేసారి 67 వేల మంది సౌకర్యవంతంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా భవన నిర్మాణం జరిగింది.. 4500 పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవన సముదాయంలో 131 హైస్పీడ్ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు..అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా ఈ నిర్మాణం చరిత్ర సృష్టించింది.. ప్రస్తుతం సూరత్ నుంచి ఏటా రూ. 2 లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపార కార్యకాలపాలు జరుగుతుండగా,,రాబోయే రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పెరుగుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *