AMARAVATHIHYDERABAD

చంద్రబాబును పరామర్శించిన జనసేనాని,ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదన

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లోని అయన నివాసంలో శనివారం సమావేశం అయ్యారు..ఇరు పార్టీ అధినేతలు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం..చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన్ను పవన్ పరామర్శించారు..చంద్రబాబుతో భేటి అయిన సందర్బంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించినట్లు తెలుస్తొంది.. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా, ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుటం..

బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా,, రిపేర్లు చేసుకోవాలన్న ఉచితంగా ఇసుక పంపిణీ,, దాదాపు 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ…సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు, చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించే వారికి రూ.10లక్షల చొప్పున అర్ధిక సాయం అందించడం…

దినిః ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళికలు…”వ్యవసాయం-బంగారు ఫలసాయం” పేరిట ఉద్యాన రైతులకు రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయ ఇబ్బందులు లేకుండా సదుపాయల కల్పన…

“మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట” ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ,, ప్రయివేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు,, సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు అంశాలను ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తొంది.త్వరలోనే ఇరుపార్టీల అధినేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశలు వున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *