x
Close
NATIONAL

బీజెపీ యువనేత ఇంటిపైకి బుల్ డోజర్ చర్యలకు అదేశించిన యోగి

బీజెపీ యువనేత ఇంటిపైకి బుల్ డోజర్ చర్యలకు అదేశించిన యోగి
  • PublishedAugust 8, 2022

అమరావతి: సమాజంలో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పపడితే,,అలాంటి వారు ఏవరు అయిన వదిలేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి అధిత్యనాథ్ నిరూపించాడు..బీజెపీ యువనేతగా చలమణి అవుతున్న శ్రీకాంత్‌ త్యాగికి సంబంధించిన కట్టడాలను,,యోగి అదేశాలతో బుల్డోజర్‌ తో అధికారులు కూల్చివేశారు..ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లితే..ఉత్తరప్రదేవ్ లోని నొయిడా ప్రాంతంలో బీజేపీ యువనేత శ్రీకాంత్‌ త్యాగి,, ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద నేరారోపణలు నమోదు చేశారు..సోమవారం నొయిడా సెక్టార్‌-93లోని గ్రాండ్‌ ఒమాక్సే హౌజింగ్‌ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను సంబంధిత అధికారులు కూల్చివేశారు..ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్‌ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి..ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్‌ దారుణంగా వ్యవహరించాడు..ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు..సదరు వీడియో వైరల్‌ కావడంతో,, పోలీసులు రంగంలోకి దిగారు..ఇదే సమయంలో శ్రీకాంత్‌ అనుచరులు మరోసారి హౌజింగ్‌ సొసైటీ వద్దకు చేరుకుని,, ఆమె అడ్రస్‌ కావాలంటూ వీరంగం సృష్టించారు..దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్‌ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం..సీ.ఎం యోగి,,త్యాగిని అంతటితో వదిలి పెట్టలేదు..నోయిడాలోని భంగెల్‌ మార్కెట్‌లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తనిఖీలు జరిగాయి..అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి..అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది..ప్రస్తుతం త్యాగి పరారీలో ఉన్న,, అతని కోసం గాలింపు కొనసాగుతోంది..పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి.. పోలీసులు,అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు.. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.