హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ 87వ పుట్టినరోజు సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి స్వయానా కైకాల నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు..అంతేకాదు ఆయన చేత కేక్ కట్ చేయించారు.. దీంతో కైకాల సంతోషం వ్యక్తం చేశారు..ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిరు,, కైకాల గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు..”పెద్దలు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన్ని స్వయంగా కలవడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు..చిరంజీవి చిత్రాల్లో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా, కమెడియన్ గా చేశారు. యముడికి మొగుడు, బావగారు బాగున్నారా? కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయేది.. కొన్నాళ్లుగా వయో సంబంధింత సమస్యలతో బాధపడుతున్న కైకాల ఇంటికే పరిమితం అవుతున్నారు..గత ఏడాది ఆయన ఆరోగ్యం విషమించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు..