AMARAVATHIMOVIE

తమిళ స్టార్ హీరో విక్రమ్ కు సినిమా షూటింగ్ లో ప్రమాదం

అమరావతి: తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం..ఈ ప్రమాదంలో విక్రమ్ తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు..విక్రమ్ కి  వైద్య పరీక్షలు నిర్వహించిన వైధ్యులు ఆయన పక్కటెముకలు విరిగాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించినట్లు తెలియ వచ్చింది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది..పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు..ఈ వార్తా తెలుసుకున్న విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *