అమరావతి: ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే(45) ఎన్నికైయ్యారు.శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బైచుంగ్ భూటియాకు కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే పడింది..చౌబేకు 33 ఓట్లు పోల్ అయ్యాయి..వీరిద్దరూ ఫుట్బాల్ మాజీ ఆటగాళ్లు..85 ఏళ్ల ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ చరిత్రలో మాజీ ప్లేయర్ అధ్యక్షుడిగా ఎంపికవడం ఇదే తొలిసారి..45 ఏళ్ల కళ్యాణ్ చౌబే గోల్ కీపర్… గతంలో మోహన్ బగాన్,,ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే ఒక్కసారి కూడా భారత పుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు..కల్యాణ్ చౌబే టాటా పుట్‌బాల్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు..1996 గోల్డెన్ బ్యాచ్ నుంచి పాస్‌ఔట్ అయ్యాడు..కొన్ని సందర్భాల్లో జట్టుకు ఎంపిక అయినప్పటికి,,ఆటలోకి దిగలేదు..వయసు ఆధారిత ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం భారత్‌కు ఆడాడు..గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున కృష్ణా నగర్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.. ఈస్ట్ బెంగాల్ జట్టులో బైచుంగ్ భుటియా,,చౌబీ సహచరులే..కర్ణాటక ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు,, కాంగ్రెస్ ఎమ్మెల్యే NA హ్యారిస్ ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు..అరుణాచల్ ప్రదేశ్ ప్రతినిధి కిపా అజయ్ ఆంధప్రదేశ్ అభ్యర్థి గోపాల్‌కృష్ణ కొసరాజును ఓడించి కార్యదర్శిగా గెలిచారు..ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 14 మంది ఎంపికయ్యారు..