AMARAVATHINATIONAL

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే ఆంశంను చట్టసభలకు వదిలివేయాలి-కేంద్రం

అమరావతి: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకిస్తూ,,ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది..తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొంత మంది వారి అభిప్రాయాలను,సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్రం అభిప్రాయపడింది..ఇలాంటి బంధాలను..ప్రస్తుతమున్న భారతదేశ వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది..వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టసభల అంశమని,, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది..ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది..స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ జరపనుంది..ఈ నేపథ్యంలో కేంద్రం నేడు (17వ తేదీన) పిటిషన్‌ దాఖలు చేసింది..కేంద్రం వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం,, దీనిపై కూడా ఏప్రిల్ 18వ తేదీన విచారణ జరుపుతామని తెలిపింది..స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు,,కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది..ఇది పూర్తిగా చట్ట సభల పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్‌ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది..స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని తెలిపింది.. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *