AMARAVATHINATIONAL

కరోనా కొత్త వేరియంట్ ఆర్క్‌ చురస్ (XBB.1.16) జాగ్రత్తలు అవసరం

అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..కొత్త వేరియంట్ కొవిడ్-19 ఆర్క్‌ చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది..కరోనా యొక్క కొత్త రూపాంతరాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు..ఈ కొత్త వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ప్రమాదమని,,ఆర్క్‌ చురస్ (XBB.1.16) భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోకి వ్యాపించిందన్నారు..ఇది ఓమిక్రాన్ కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. ఆర్క్ చురస్ స్పైక్ ప్రోటీన్ కారణంగా వేగంగా ప్రజలకు సోకుతుందన్నారు..కోవిడ్ కొత్త వేరియంట్ ఆర్క్‌ చురస్ (XBB.1.16) ఇప్పటివరకు 22 కంటే ఎక్కువ దేశాలలో కనుగొనడం జరిగిందని వార్విక్ యూనివర్సిటీ వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ తెలిపారు..కొత్త వేరియంట్ సైడ్ ఎఫెక్ట్స్ చూడనంత వరకు దాని తీవ్రత అర్థం కాదన్నారు..

లక్షణాలు:- ఆర్క్‌ చురస్ (XBB.1.16) వేరియంట్ సోకిన వారిలో అధిక జ్వరం, దగ్గు, కళ్లు దురదగా ఉండి ఎర్రబడడం లేదా కండ్లకలక లక్షణాలు కనిపిస్తాయి..ఈ వేరియంట్‍లో కళ్లకు సంబంధించి లక్షణాలు విభిన్నంగా ఉండనున్నాయని పేర్కొన్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *