ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఎం.డి ద్వారకా.తిరుమలరావు

అమరావతి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం-శుభప్రదం,,సురక్షితం అనే నినాదానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె,పల్లెల్లో వైభవంగా జరిగే సంక్రాంతి కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఆర్టీసీ,,మరో అడుగు ముందుకేసి రాయితీలూ ప్రకటించింది.. వయోవృద్ధులకు టిక్కెట్టులో 25 శాతం రాయితీ ఇస్తోన్న ఆర్టీసీ,,ప్రస్తుతం నలుగురు ప్రయాణికులు (పిల్లలతో సహా) ఒకేసారి టిక్కెట్టు తీసుకుంటే చార్జీ మొత్తంలో ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది..కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి ఈ విధానం ఉపయోగకరంగా వుంటుంది..ఈ–వాలెట్ ద్వారా టిక్కెట్టును బుక్ చేసుకున్నా చార్జీలో ఐదు శాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది..అలాగే రానూపోనూ టిక్కెట్టును ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణం ఛార్జీలో 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది..ప్రయాణికులు ప్రైవేటు బస్సుల వైపు వెళ్లకుండా,,డిస్కౌంట్ లు ఇస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది..ఈ విధానాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు..జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు..ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు.