నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేశారు..అనంతరం సీ.ఎం మాట్లాడుతూ అటువైపు చెన్నై, ఇటువైపు విశాఖపట్నం, మరోవైపు ముంబాయి ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహానగరంగా ఎదగాయంటే.. అక్కడ పోర్టు ఉండడమే. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించవచ్చు.. పోర్టు రావడం వల్ల ఉదోగ అవకాశాలు చాలా పెరుగుతాయి..పోర్టు రావడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు వల్ల ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు తగ్గిపోతాయి..నీటి రవాణా చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం.తద్వారా రాష్ట్రానికే కాకుండా.. ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారతాయన్నారు..రూ.3700 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు:-ఈ రోజు పోర్టు కోసం 850ఎకరాల భూమి కూడా పూర్తిగా సేకరించి… రూ.3700 కోట్లతో పనులు కూడా మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తులు కూడా ఇదే ఇన్‌ఫ్రాస్చ్రక్టర్‌లోనే వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కోదానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ 4 బెర్తుల ద్వారా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసే సామర్ధ్యం లభిస్తే… మరో రూ.1200 కోట్లు మనం ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు పెట్టుబడి పెడితే… ఏకంగా 50 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు.కొత్తగా 4 నాలుగు పోర్టులు:- స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. అంటే ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నంలు రానున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్న టన్నుల కెపాసిటీకి కూడా వస్తోందన్నారు..